జియో మరో సంచలనం….

రిలయన్స్ జియో   మరో అద్భుత మైన ఆఫర్ ఇస్తోంది. 100mbps స్పీడ్ తో 100GB డేటా ఫ్రీగా ఇస్తానంటోంది. కొన్ని ఎంపిక చేసిన సిటీలలో ఈ సర్వీసెస్ ను అందుబాటులోకి తేనుంది. అయితే ఎప్పుడు,ఎక్కడ ఈ ఆఫర్ ను లాంచ్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి వడోదర, సూరత్, అహ్మదాబాద్ లలో టెస్ట్ చేస్తున్నారు. జియో ట్విట్టర్ అకౌంట్ ద్వారా జియో ఫైబర్ ఆఫర్ బయటపడింది.

దీనికింద 90 రోజుల వరకు జియోఫైబర్ సర్వీసులకు కంప్లిమెంటరీ సర్వీసులను అందించనుందట. అయితే రిఫండబుల్ ఇన్ స్టాలేషన్ ఛార్జీలు రూ.4500ను రిలయన్స్ జియో వసూలు చేయనుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. జియో ఫైబర్ సర్వీసులను కొనసాగించడం ఇష్టలేని యూజర్లకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తుందని సమాచారం.  అయితే వీటితో పాటు జియో హోమ్ బ్రాడ్ బ్యాండు FTTH సర్వీసులను 500 రూపాయలకు 600జీబీ డేటా, 2000 రూపాయలకు 1000జీబీ డేటాను అందించడం నుంచి ప్రారంభిస్తుందని మరో రిపోర్టులో పేర్కొన్నాయి. వీటిపై పూర్తి క్లారిటీ రావాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే

]]>