డిసెంబర్ నెలతో ముగిసిన వెల్కమ్ ఆఫర్ ను సమ్మర్ సర్ ప్రైజ్ పేరుతో సేవలను పొడిగించిన విషయం తెలిసిందే కానీ సమ్మర్ ఆఫర్లను వెనక్కి తీసుకోవాలని జియోకు ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్. ‘జియో ప్రైమ్ మెంబర్షిప్’ పొడిగింపు నిర్ణయాన్ని, రూ.303కే 3 నెలల పాటు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను వెనక్కితీసుకోవాలని రిలయన్స్ జియోకు సూచించింది. ట్రాయ్ ఆదేశాలపై ఏకీభవిస్తామని ప్రకటించిన జియో… కొద్ది రోజుల్లోనే అమలు చేస్తామని తెలిపింది.ఇంతకు ముందు ‘సమ్మర్ సర్ప్రైజ్’ వినియోగించుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో ఓ ప్రకటన ద్వార తెల్పింది.
జియో మెంబర్షిప్ తీసుకుంటేనే జియో అందిస్తున్న సదుపాయాలు వర్తిస్తాయని పేర్కొంది. మార్చి 31న జియో వెబ్సైట్, యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకోలేక పోయారు.దీంతో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను 15రోజులపాటు పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించిది. అంతేకాకుండా కేవలం రూ.303కే మూడు నెలలపాటు ఉచిత కాలింగ్, రోజుకు 1జీబీ డేటాను ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది.
]]>