రెచ్చిపోయిన హ్యాకర్లు..వేల వెబ్‌సైట్ల హ్యాక్

 ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా అతిపెద్ద సైబర్‌ దాడికి పాల్పడ్డారు హ్యాకర్లు. దీంతో పలుదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.కంప్యూటర్లను అన్‌లాక్‌ చేయాలంటే 300 డాలర్లు ఇవ్వాలన్నఎస్ ఏం ఎస్ లు పంపుతున్నారు. వివిధ దేశాలకు చెందిన కీలక సైట్లను  45 వేల మంది 74 దేశాలకు చెందిన వెబ్‌సైట్లను ఒకే రోజు హ్యాకింగ్‌ చేశారు. మాస్కోలోని సైబర్‌ సెక్యురిటీ సంస్థ కాస్పర్‌ స్కై ల్యాబ్‌ ఈ విషయాన్ని ద్రువికరించింది.హ్యాకింగ్‌ భారిన పడి ఎక్కువగా నష్టపోయింది రష్యానే.

అత్యవసర సేవలకు సైతం విఘాతం కలగింది. తొలుత బ్రిటన్‌లో పలు ఆస్పత్రుల సైట్లపై సైబర్‌ దాడి జరిగింది. దీంతో ఆస్పత్రుల్లోని ఐటీ వ్యవస్థ ఒక్కసారిగా కూలిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోగా… కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న మెసేజ్ స్కీన్లపై కనిపించింది. ఆ తర్వాత నిమిషాలు, గంటలు గడిచేకొద్దీ ప్రపంచమంతా సైబర్‌ దాడి జరిగింది. వానా క్రై రాన్సమ్‌వేర్‌ ద్వారా కంప్యూటర్లను హ్యాక్‌ చేశారు హ్యాకర్లు.

మైక్రోసాఫ్ట్ విండోస్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగిస్తున్న కంప్యూటర్లపై సైబర్‌ దాడి జరిగింది. విండోస్‌లో ఎస్.ఎం.బి.వి 2 అనే రిమోట్‌కోడ్‌.. వానా క్రై రాన్సమ్‌వేర్‌తో హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. ఇంగ్లండ్‌, రష్యా, టర్కీ, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, అమెరికా, చైనా, స్పెయిన్‌, ఇటలీ, తైవాన్‌ ఇలా… అన్ని దేశాల్లోనూ ఇదే వానా క్రై రాన్సమ్‌వేర్‌తో హ్యాక్‌ చేశారు. కంప్యూటర్లను అన్‌లాక్‌ చేయాలంటే 300 డాలర్లు ఇవ్వాలన్న మెసేజ్ కనిపించిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

]]>