శశికళ అక్రమ ఆస్తుల కేసు లో జైలు కు వెళ్లడం తో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే శాసనసభా పక్షనేత పళనిస్వామికి గవర్నర్ నుంచి పిలుపు రావడం తో పళని స్వామి పలువురు మంత్రులతో కలిసి గోల్డెన్ బే రిసార్టు నుంచి రాజ్ భవన్ కి బయలు దేరారు. పన్నీర్ సెల్వం కి మెజార్టీ ఎక్కువ గా లేకపోవడం తో పళని స్వామి కే అవకాశం లభిస్తుందని అందరు భావిస్తున్నారు.ఇంతకు ముందే పళని స్వామీ గవర్నర్ ని కలిసి తమకు ఎక్కువ మంది ఎం ఎల్ ఏ ల మద్దతు ఉందని తెలియజేసారు.ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే పళని స్వామి కే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
]]>