ఇప్పటి యువత కు ఎవరైనా వంట చేసి పెడితే బావుండు అనిపిస్తుంటుంది ఎందుకంటే చేసుకొనే తినే ఓపిక లేక ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటయ్యారు.కాని ఈ బామ్మ చుడండి సెంచరి క్రాస్ చేసిన ఎంత మంది కైనా ఎన్ని వెరైటి వంటలనైన వండేస్తుంది.ఈ బామ్మని చుస్తే అందరు ముక్కు మీద వేలేసుకోక తప్పాదు.సాంప్రదాయ రుచికరమైన వంటల తయారీలో గుడివాడ మస్తానమ్మ స్టయిలే వేరు.106 ఏళ్ళ వయసులో చలాకీగా, తన పనులు తను చేసుకుంటూ నోరూరించే వంటకాలతో, టాలెంట్ ప్రదర్శిస్తూ యూ ట్యూబ్ సంచలనంగా మారిపోయింది.’కంట్రీ ఫుడ్స్’ పేరుతో సొంత ఛానెల్‌ను నడుపుతున్న ఈ బామ్మ లక్షల ఫాలోయర్స్‌తో దుమ్మురేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మస్తానమ్మ యూట్యూబ్ స్టార్.. యూ ట్యూబ్ సెన్సేషన్.కంట్రీ ఫుడ్స్ ఛానల్ లో రకరకాల వంటల నైపుణ్యంతో గుడివాడ బామ్మ సూపర్ పాపులర్. ఆమె చేతి వంటకాల లిస్ట్ ఒకటా రెండా.. చాలా పెద్దదే. ఎగ్ దోశ, ఫిష్ ఫ్రై ,పాయా,అరటి ఆకులతో చేసే స్పెషల్ ఫిష్ ఫ్రై, బ్యాంబూ చికెన్ బిర్యానీ లాంటి ఇతర వంటకాలను సులభంగా వండేస్తోంది.ముఖ్యంగా ఈమె వంటకాల్లో వాటర్ మిలన్ చికెన్ ప్రత్యేకమైందనే చెప్పాలి.పుచ్చ్చకాయ లో చేసిన చికెన్ వీడియేకే 66లక్షల వ్యూస్ వచ్చాయి.ఈ వెరైటీ వంటకాలతో అమెరికా, బ్రిటన్,దుబాయ్‌లలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
బామ్మ మనమడు లక్ష్మణ్ విడియో లను తీసి అప్లోడ్ చేసేవాడు.ఇటీవల 106 వ పుట్టినరోజు సందర్భంగా చీరలు, గ్రీటింగ్ కార్డులు లాంటి బోలెడన్ని బహుమతులు అందుకుందట.ముఖ్యంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్కుచెందిన ఓ ఫ్యాన్ చీరను పంపించారంటూ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. సుమారు 2 లక్షల 48వేలమంది సబ్ స్కైబర్లు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటు వయసులో లేటెస్ట్ సంచలనంగా మారిన మస్తానమ్మకు మనం కూడా సాహో అనాల్సిందే.