ఎందరో మహానుభావులు…..అందరికీ వందనాలు

రాష్ట్రపతి భవన్‌లో 64వ జాతీయ చ‌ల‌న‌చిత్ర పుర‌స్కారాల ప్రదానోత్సవంలో ఘనంగా జరిగింది… ఈ వేడుకలో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ చేతుల మీదుగా అందుకున్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్,అనంతరం మాట్లాడిన విశ్వనాథ్,ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ తెలుగులో తన ఉపన్యాసాన్ని ఇచ్చారు.జాతీయ అవార్డు ల చరిత్రలో అవార్డు గ్రహీత మాట్లాడటం ఇదే మొదటి సారి.ఈ సందర్భం గా ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు,జ్యూరి సభ్యులకు కృతజ్ఞ్యతలు తెలియజేసారు.

ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు కె.విశ్వనాథ్… ఈ అవార్డును అందుకున్న సందర్భంగా నా తల్లిదండ్రులకు ప్రణామాలు చేస్తున్నా… నాతో కలిసి పనిచేసిన నా టీమ్‌కు ధన్యవాదాలు… దేశంలో ఉన్న నా అభిమానులు అందరికీ ధన్యవాదాలు… సర్వేజన సుఖినో భవంతూ అంటూ ఉపన్యాసాన్ని ముగించారు కళాతపస్వి… ఆయనతో పాటు ఉత్తమ నటుడిగా అక్షయ్‌కుమార్‌, ఉత్తమ నటిగా సోనమ్‌కపూర్‌, నిర్మాత దిల్‌రాజు, నృత్య దర్శకుడు రాజు సుందరం, పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ తదితరులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.

]]>