ఆడవారి కి అందాన్నిచ్చేవి శిరోజాలు,వింటర్ లో సాదారణంగా అందరిలోను హెయిర్ ఫాల్ కనిపిస్తుంది ఇప్పుడు వింటర్ పోయి సమ్మర్ వచ్చేస్తుంది మీ శిరోజాలు మళ్ళి మంచిగా పెరగాలి అంటే ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాస్త జాగ్రత్త తీసుకోండి.
**కొబ్బారి నూనె క్రమం తప్పకుండా హెయిర్ కి అప్లై చేస్తూనే ఉండాలి.ఎందుకంటే కొబ్బరి నూనె కురుల పటుత్వానికి మృదుత్వానికి ఉపయోగపడుతుంది.జుట్టు కి ఏంటో మేలు చేస్తోంది.
**మందార పువ్వుల రసం తీసి, కొబ్బరి నూనె లో వేసి మరగనివ్వాలి,చల్లారిన తర్వాత ఆయిల్ ను తలకు వాడటం ద్వారా జుట్టు మంచి ఎదుగుదల కనిపిస్తుంది.
**జుట్టు కి మంచి మెరుపు కావాలంటే కొంచెం నిమ్మరసం కలిపి కురులను కడగాలి.
**జుట్టు రాలకుండా,నల్లగా పెరిగేందుకు పచ్చిధనియాల రసాన్ని తలకి పెట్టి మసాజ్ చేయాలి,జుట్టు నల్లగా మృదువుగా అవుతుంది మరియు జుట్టు రాలే సమస్యని అరికడుతుంది.
**కొబ్బరి నూనె ని కాసేపు మరిగించి అందులో విటమిన్ e క్యాప్సూల్స్ వేసి తలకు రాస్తే జుట్టు అందంగా పెరుగుతుంది.
**మెరిసే మరియు మృదువైన జుట్టు కోసం టీ తో జుట్టు ని కడిగితే మంచి ఫలితం లభిస్తుంది.
**మెంతులు పేస్ట్ తలకు పట్టించుకోని 30 నిముషాలు తర్వాత తలస్నానం చెయ్యాలి.
**వేపాకు మిశ్రమాన్ని తలకు పెట్టుకొని కాసేపు ఆగి వేడి నీటి తో తలస్నానం చెయ్యండి .
**ఉసిరికాయను రోజు తినండి,ఉసిరికాయ మిశ్రమాన్ని తలకు వాడితే జుట్టు రాలడం తగ్గుతుంది.
**నిమ్మకాయ రసం జుట్టుకు వాడడం వలన చుండ్రు తగ్గడం తో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది.
**గోరింటాకు కోడి గ్రుడ్డు లోనో పచ్చ సోనో,నిమ్మకాయ రసం తో కలిపి జుట్టుకు క్రమం తప్పకుండ వాటినట్లయితే జుట్టు రాలడం తగ్గిపోతుంది.
]]>