అక్కినేని వారి ఇంటి కి కాబోయే కోడలు,హీరొయిన్ సమంత ఈ సారి తన బర్త్‌డే ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంది.అనాథపిల్లలతో కలిసి ఆమె బాహుబలి -2 చిత్రం చూసిన సంగతి తెలిసిందే. తర్వాత సమంతా తన బర్త్‌డేను అక్కినేని ఫ్యామిలీతో కలిసి శుక్రవారం సాయంత్రం సెలబ్రేట్ చేసుకున్నారు.మరిది అఖిల్, కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.అఖిల్ సమంతాకు విషెస్ చెబుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇంటర్నెట్లో ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. డార్లింగ్ వదినకు హ్యాపీ బర్త్‌డే..ఈ ఏడాది నీకు అంతా మంచే జరుగుతుందని అఖిల్ ట్వీట్ చేశాడు.
]]>