అమ్మా నీకు వoదనాలు…

కనిపించే దైవం అమ్మ…కనిపెంచే రూపం అమ్మ…ఆనందంగా కనిపించే అమ్మ జీవితం లో అనుభవాల అగాధాలెన్నో అవమానాల వ్యదలెన్నో…ఓ అఖండ యశస్వి…జీవితం లో ని ఆటు పోట్లుకి ఎదురీదేదిఅమ్మ..అక్షరం రాకపోయిన అమ్మే పెద్ద గురువు…కపటం లేని ప్రేమ కు అమ్మ ప్రతి రూపం…స్వార్ధం లేని సేవకు సారధి అమ్మ…ఆలు పెరగని ఆది పరాశక్తి అమ్మ…ఓ నిత్య సైనికురాలు అమ్మ…అందరికి ఆదర్శ మూర్తి ప్రేమనుగరాలు పంచె దీప్తి..ప్రతి మనిషి చీకటి జీవితానికి వెలుగు అమ్మ..ఈ సృష్టికి మూలం అమ్మ.

మాతృదేవోభవ అని అమ్మనే మొదటి దైవం గా భావిస్తారు.దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అందుకే ఆమెను దేవుడి ప్రతిరూపం అని కొలుస్తారు. తొమ్మిది నెలలు మోసి మనకు జన్మనిచ్చిన అమ్మకు ఏమిచ్చినా రుణం తీరదు. కష్టమెచ్చినా,కన్నీళ్లొచ్చినా నోటి వెంట వచ్చే మొదటి మాట అమ్మ.అమ్మ గురించి యెంత చెప్పిన తక్కువే..అమ్మరుణo ఏం చేసిన తీర్చుకోలేము.

అమ్మ కోసం అన్ని దేశాలు కలిసి చేసే చిన్న ప్రయత్నం,అమ్మ త్యాగాలకు గుర్తుగా చేసుకునేదే మదర్స్ డే. ప్రపంచ వ్యాప్తంగా పలు తేదీల్లో  ఈ మదర్స్ డే జరుపుకుంటారు. ఆసియా, దక్షిణ దేశాల్లో ప్రతీ ఏడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. మదర్స్ డే జరుపుకోడానికి ఓ రోజు ఎందుకని అంటారు చాలా మంది. అసలు అమ్మను మర్చిపోతే కదా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అని ప్రశ్నించే వారు లేకపోలేదు. ఏమిచ్చి  అమ్మ రుణం తీర్చుకోగలం చెప్పండి.అందుకే అమ్మ త్యాగాలకు,ఈ ఒక్క రోజు అమ్మ త్యాగాలను ప్రత్యేకంగా తలుచుకుంటాం.అమ్మ నీ సేవలకు వందనం.

అమ్మలందరికి పేరు పేరు నా మదర్స్ డే శుభాకాంక్షలు…అమ్మను పూజిద్దాం…ఆడపిల్లల్ని గౌరవిద్దాం…morning7am.com]]>