రాహుల్ ని ప్రధాన మంత్రిని చేసిన దిగ్విజయ్ సింగ్

రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా చేయడమే కుదరడం లేదు కానీ దిగ్విజయ్ సింగ్ మాత్రం ఏకంగా ప్రధాన మంత్రినే చేసేశారు.వయసు మీద పడటంతో జ్ఞాపక శక్తి తగ్గుతోందో.. లేదా పదాలు తడబడుతున్నాయో తెలియదు గానీ ఆయన ఈ రోజు రాహుల్ గాంధీ ని ఒక్కర్నే ఇలా అనలేదు ఇంతకు ముందు కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ అనబోయి.. భారత ఆక్రమిత కశ్మీర్ అనేశారు. అదికూడా రెండు దేశాల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయం లో ఒసామా బిన్ లాడెన్‌ను ‘ఒసామాజీ’ అని, హఫీస్ సయీద్‌ను ‘సాహెబ్’ అని అన్నారు.ఆయన చేస్తున్న ట్వీట్లు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి.అసలు విషయం ఏమిటంటే రాజీవ్ గాంధీ అని రాయబోతూ రాహుల్ గాంధీ అని రాసేశారీ పెద్దాయన.

]]>