టీవీ సీరియల్ శరవణన్ మీనాక్షి లోని మైనా పాత్ర ద్వారా పాపులర్ అయిన ప్రముఖ తమిళ టివీ, సినీ నటి నందిని(30) భర్త కార్తికేయన్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఆర్థిక ఇబ్బందుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.విరుగంబాక్కమ్‌లోని ఓ లాడ్జ్‌లో ఆయన విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.ఈ విషయంహోటల్ సిబ్బంది ద్వారా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.చెన్నైలో జిమ్ నడుపుతున్న కార్తికేయన్ మొదటి భార్య చనిపోవడంతో గత ఏడాది జూన్‌లో నందినిని వివాహం చేసుకున్నారు.కానీ మనస్పర్థల కారణంగా వీరిద్దరు కూడా విడిపోయారు.కార్తికేయన్ ఆర్ధిక ఇబ్బందుల వల్ల జిమ్ మూతపడంతో మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా లేఖ కూడా రాశారు.ఈ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నందిని ఓ తమిళ దినపత్రికతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కార్తికేయన్ చాలా మందివద్ద డబ్బులు తీసుకున్నాడని,ఆ డబ్బులకోసం అందరు తనని ఇబ్బంది పెట్టారని,దీంతో కార్తీక్‌ని తాను నిలదీసానని,ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తన తల్లిదండ్రులు తనను తీసుకెళ్లారని,ఈ ఘటనతో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.అలాగే తన భర్తకు వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కార్తీక్ ను గతంలో అరెస్ట్ చేశారని తెలిపింది.డబ్బు కోసం తనను వివాహం చేసుకున్నాడని,కార్తీక్ ఆత్మహత్య కారణంగా తన పరువు పోయిందని నందిని ఆరోపించింది.
]]>