ఇక్కడ మహిళా బెటాలియన్ నియామకం….

మహిళా బెటాలియన్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం 1000 మంది మహిళా పోలీసులను నియమించాలని నిర్ణయించింది.కేంద్రం శాంక్షన్ చేసిన ఐదు ఇండియన్ రిజర్వడ్ బెటాలియన్స్ తో వీరు భాగస్వాములవుతారు,ఈ ఐదు ఇండియన్ రిజర్వడ్ బెటాలియన్స్ లో 5వేల పోస్టులకుగాను జమ్మూ కశ్మీర్ కు చెందిన 1,40,000 మంది యువత దరఖాస్తు చేసుకున్నారు.ఇందులో 40 శాతం అప్లికేషన్లు కశ్మీర్ లోయ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.కశ్మీర్ లో రాళ్లు రువ్వే వారిని అదుపు చేయడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తారని హోంశాఖ కార్యాలయం తెలిపింది.స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఇండియన్ రిజర్వుడ్ బెటాలియన్స్ ఏర్పాటు చేశామని.60శాతం వరకు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాల నుంచి భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

 ]]>