ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై టెక్ దండ యాత్రకి సిద్ధం అయ్యింది. ఇంతకీ దండ యాత్ర ఎవరిమీద ? దోమల మీద, ఆంధ్ర ప్రదేశ్ లో దోమలు విపరీతం గా వున్నాయి . వీటిని అరికట్టేందుకు చంద్ర బాబు ప్రభుత్వం దోమల్ మీద డిజిటల్ పద్దతిలో దండ యాత్ర చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే కేంద్రానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపించారు ,ఐతే డిజిటల్ యుద్ధం ఎలా చేస్తారు ప్లాన్ ఏమిటి ? మోడెమ్ టెక్నాలజీ పద్దతి ద్వారా దోమల గుడ్లను గుర్తించి నాశనం చేస్తారు. దీనికే “స్మార్ట్ మస్కిటో డెన్సిటీ సిస్టం” అనే పేరు పెట్టారు. ముందుగా తిరుపతి,విజయవాడ ,విశాఖ నగరాల్లో ప్రయోగాత్మకం గా ఈ విధానాన్ని మొదలు పెడతారు,చికెన్ గున్యా, మలేరియా డెంగీ వంటి వ్యాధుల్ని అరికట్టేందుకు ఈ టెక్నాలజీని వాడతారట . మొత్తం 185 చదరపు కిలో మీటర్ల లో ప్రారంభం ఇయ్యి ఈ యుద్ధం లో ప్రతి చదరపు కిలోమీటర్ కి ఒక సెన్సె ని ఏర్పాటు చేస్తారు , మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు నాలుగు కోట్లు ,
]]>