ఆ ఎస్సై ..హిజ్రా ..తమిళనాడులో బాధ్యతలు

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని(హిజ్రా) దేశంలోనే మొట్టమొదటి సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై త్వరలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ధర్మపురిలో టౌన్‌లో ఆమెకు పోస్టింగ్‌ ఖరారుచేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శనివారం ఆమె పోస్టింగ్‌ ఆర్డర్స్‌ అందుకున్నా  రు. జీవితంలో అనేక ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కుని తోటి హిజ్రాలకు ఆదర్శంగా ప్రీతికా నిలిచింది. ఆమె ఎస్‌ఐ పదవికోసం ఎన్నోసార్లు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి నిరాశకు లోను కాకుండా విజయం సాధించిన ప్రితికా ఇకపై తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేస్తానని ఆనందంగా చెప్పింది

సి తమిళ్

]]>