ఆంధ్ర ,తెలంగాణా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఫైలు ఇప్పుడు కేంద్రం కోర్ట్ లో వుంది .రెండు రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతుండడంతో నాయకులకు ఆశలు పల్లకి ఎక్కడం మొదలు పెట్టారు క్రేంద్ర సర్కార్ నుంచి సిగ్నల్స్ వస్తుండటంతో కారు పార్టీలో కొత్త ఆశలు మొలకెత్తాయి. నియోజక వర్గాల పునర్విభజన పక్కాఅని గులాబీ బాస్ పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నియోజక వర్గాల సంఖ్య పై చర్చ జరుగుతూనే ఉంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడే అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య కూడా పెంచాలని అడిగింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడున్న 119 నియోజకవర్గాలను 153కు పెంచాలని కేసీఆర్ తోపాటు రాష్ట్ర ఎంపీలు కేంద్రానికి తీర్మానాన్నిసైతం పంపించారు .నియోజక వర్గాలు పెరిగితే అందరికీ ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వస్తుందంటున్నారు. టీఆర్ఎస్ లో చేరిన వేరే పార్టీల లీడర్లు కూడా పోటీ చేయచ్చని కేసీఆర్ నాయకులతో చెప్పినట్టు సమాచారం.ఇక కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు కేసీఆర్. ఇదే విషయంపై సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారట సీఎం
]]>