మీఇంట్లో ఆడాళ్లకి పెట్టుకోండి అంటున్న సునీత

మీ ఇంట్లో ఆడపిల్లల్ని గురించి ఇలా పిచ్చి పిచ్చి హెడ్డింగులు పెట్టి యుట్యూబ్ లకు ఎక్కిస్తారా అంటూ సింగర్ సునీత  ఫైర్ అయ్యింది.విషయం ఏంటంటే సీనియ‌ర్ సింగ‌ర్ సునీత కుమార్తె గురించి స్టోరి వేసిన ఓ యూట్యూబ్ చానెల్.కొన్ని ఫోటోల్ని, వీడియోల్ని పోస్ట్ చేసి “సింగర్ సునీత కూతురిని చూశారా.. కత్తి లాగా ఉంది” అంటూ హెడ్డింగ్ పెట్టి స‌ద‌రు యూట్యూబ్ చానెల్ వాళ్లు ఆ లింక్‌ని సోషల్ మీడియా లో షేర్ చేశారు.

ఈ లింక్ ఆన్‌లైన్‌లో బాగా వైర‌ల్ అయ్యింది. అయితే ఆ నోటా, ఈనోటా అది సింగ‌ర్ సునీత చెవిలో ప‌డింది.ఇంత చీప్ హెడ్డింగ్ పెడతారా? అంటూ సదరు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై సునీత కారాలు మిరియాలు నూరారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే యూట్యూబ్‌లో ఇలాంటివి నిత్య‌కృత్యం. ఎన్నిటికి కేసు పెట్ట‌గ‌లం అంటూ సైలెంట్ అయిపోయాన‌ని సునీత తెలిపారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయ‌డానికి, నా కూతురిపై వ్యాఖ్యానించ‌డానికి ఏం హ‌క్కు ఉంది? అంటూ సునీత ప్ర‌శ్నించారు.

సునీత ప్రశ్న లో అర్ధం ఉంది అనిపిస్తుంది.సెల‌బ్రిటీల ఫోటోల్ని, వీడియోల్ని యూట్యూబ్‌లో అమ్ముకుని వ్యాపారం చేయ‌డం ప్ర‌స్తుత ట్రెండ్‌. అయితే హెడ్డింగుల్లో చీప్‌ ట్రిక్స్ ప్లే చేయ‌డం ద్వారా యూట్యూబ్ చానెళ్లు అభాసుపాల‌వుతున్నాయ్‌.

]]>