మండే ఎoడలనుండి కళ్ళను ఎలా కాపాడుకోవాలో తెలుసా…

ప్రతి యేట ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది.వాతావరణానికి తగ్గట్లు మన జీవన శైలి మర్చుకుoటునే ఉన్నాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎదో ఒక వ్యాది భారిన పడక తప్పట్లేదు.ఎండలు ఈ సంవత్సరం మరీ ఎక్కువ స్థాయిలో ఉన్నాయి.ఎండ స్థాయి పెరిగే కొద్దీ అతినీలలోహిత కిరణాలు భూమిని తాకడం ఎక్కువైంది. దీనివల్ల కంటికి, చర్మానికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటికే వేడి వల్ల 30% శాతం వరకు కంటి సమస్యల కేసులు పెరిగాయని కంటి వైద్యులు చెబుతున్నారు.

కంటి సమస్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…. 
ముఖ్యంగా కన్నులు మంట కలిగి ఎరుపు రంగులోకి మారడం, దురదగా ఉండటం, కన్నులు ఎరుపుగా ఉండి కనురెప్పలు వాచినట్టు ఉండడం మొదలైనవి వేడి వల్ల కలిగే లక్షణాలు. దీని నుండి ఉపశమనం పొందాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగడం, ప్రయాణించడం, కష్టంతో కూడిన పని చేయడం వంటివి తగ్గించాలి. అవసరం ఉంటేనే బయటకు రావాలి, వీలైతే సన్‌గ్లాసులు వాడండి.
తలపై టోపీ లేదా రుమాలు ధరించండి. క్రమం తప్పకుండా తలకు నూనె రాయాలి. కంటికి చుక్కల మందు వేసుకోవాలి. ఒక టీ బ్యాగ్‌ని తీసుకొని చల్లటి నీళ్లలో ముంచి కనురెప్పల మీద 10-15 నిమిషాల పాటు ఉంచుకొని ముఖం కడుక్కోవాలి. ఇలా రోజులో 2-3 సార్లు చేస్తే కళ్ల మంటలు తగ్గుతాయి. సమస్య తీవ్రం అయ్యేట్లు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.
]]>