ఫిజిక్స్ ఎలా ఉందన్నా….

ఆంధ్ర నూతన అసెంబ్లీ భవనం లో సమావేశాలు ప్రారంభం అయ్యాయి.వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న లాబీలోకి జలీల్ ఖాన్ వెళ్లిన సందర్భంగా అక్కడ ఆనంద వాతావరణం కనిపించింది.గతం లో బి కం లో ఫిజిక్స్ చదువుకుందాం అనుకున్నాను అన్న జలీల్ ఖాన్ అందరికి గుర్తుండిపోయారు.బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పిన మీకు ఇక్కడే కాదు… ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు హాస్యాస్పదంగా మాట్లాడారు.’ఫిజిక్స్ ఎలా ఉందన్నా’ అంటూ ఎమ్మల్యే సునీల్ కుమార్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అంతలోనే అక్కడకు వచ్చిన రోజా.. ‘హాయ్ ఫిజిక్స్’ అంటూ పలకరించారు. ఈలోగా వైసీపీ మహిళా ఎమ్మెల్యేలంతా అక్కడకు వచ్చారు.’మేము నానా హంగామా చేసినా, మాపై పోలీసులు కేసు పెట్టినా… మీరు అయినంత పాపులర్ మేము అవ్వలేదు అన్నారు.దీనిపై జలీల్ ఖాన్ కూడా తనదైన శైలిలో స్పందించారు.అందరిలా చెప్తే ఏముంటుందిఉల్టాగా చెబితేనే మన గురించి అందరూ చర్చించుకుంటారని అన్నారు.

]]>