ఆ కోరికని దాచుకోవడం ఎలా !

మనిషి జీవితానికి శృంగారం కూడా అంత అవసరం. అయితే ప్రేమ, శృంగారం ఈ రెండూ ఒకటి కాదు. ఒక్క టీనేజ్‌ పిల్లల్లోనే కాదు యుక్తవయసు దాటిన వాళ్లలోనూ అసలు ప్రకృతిలోని ప్రతిజీవినీ కూడా అంతర్లీనంగా నడిపే శక్తి శృంగార ప్రోద్బలమేనంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే టీనేజ్ ప్రేమ శారీరక సంబంధాలతోనే మొదలవుతుందనే భ్రమలో ఉంటారు చాలామంది. కానీ టీనేజ్‌ ప్రేమ శారీరక సంబంధాలు కోరుకోదు. టీనేజర్స్‌ తాలూకు రొమాంటిక్‌ ప్రేమలో శరీర సంబంధమైన ఆకర్షణలకోసం వారు తహతహలాడుతుంటారు.
కలయిక విషయంలో ముఖ్యంగా మగపిల్లలు, ఆడపిల్లలు వేరు వేరుగా ఆలోచిస్తుంటారు. ప్రేమకు, సెక్సు సంబంధం జతకలిస్తే ఆ బంధం అపవిత్రవుతుందన్న భావన ఆడపిల్ల లో ఆ రెండూ కలిసుంటే అది నిజమైన ప్రేమ కాదని వాళ్ళు భావిస్తారు.మగడు చొరవ  తీసుకొంటే పెళ్ళయ్యేదాకా ఆగాలి అంటూ మృదువుగా, హెచ్చరిస్తూ, చిలిపిగా తిరస్కరిస్తారు.ఆడపిల్లలకు మగపిల్లలకు మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంటుంది. అదేమిటంటే శారీరకంగానూ ఎమోషనల్‌గానూ ఆడపిల్లలు మగపిల్లల కంటే త్వరగా అభివృద్ధి చెందుతారు. ఆమె దృష్టిలో ప్రేమలక్ష్యం సెక్స్‌ కాదు వివాహం! ఒక ఆడపిల్ల, మగపిల్లవాడు సెక్స్‌లో పాల్గొన్నారంటే మగపిల్లవాడికి సంబంధించిన ఆ తాత్కాలికానందం తర్వాత అతనికి బరువు బాధ్యతలంటూ ఉండవు. కానీ ఆడపిల్లలకు అలాకాదు, గర్భాన్ని మోయాల్సి రావచ్చు. ఆ ముచ్చట తీరాక ‘అతడు’ వివాహానికి అంగీకరిస్తాడో లేదో తెలియదు. సమాజం దృష్టిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే విజ్ఞురాలైన ఆడపిల్ల ఎప్పుడూ బాయ్‌ఫ్రెండ్‌ను ఏర్పరుచుకోవచ్చునేమో కానీ సెక్స్‌ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వివాహం తర్వాతే అంటుంది తెలివిగా. వివాహ ప్రక్రియ ద్వారా తనకూ తన పిల్లలకూ రక్షణ, పోషణ కోరుకుంటుందామె. తనను అతను నిజంగా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని వివాహం ద్వారా నిజం చేయాలనీ, ఋజువు చేయాలనీ కోరుకుంటుంది.
ఇక కొందరు మాత్రం నైతికవర్తనకంటే శరీర కోరికలకే అధిక ప్రాధాన్యమిస్తారు. వివాహ పూర్వంలాగే వివాహం తర్వాత కూడా శరీరధర్మాలకు లొంగిపోయి అవకాశాలు కలిసివస్తే ఒకరినొకరు వంచించుకునే ప్రమాదం పొంచి ఉంటుంది. వివాహమయ్యాక స్త్రీ  పురుషులిరువురూ ఏకమై శారీక ధర్మాలు పాటిస్తుంటే అది వాళ్ల మధ్య ప్రేమబంధంగా ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. ఆ ప్రేమ ఎంత శారీరకమైనదో అంత లౌకికాతీతమైనది కూడా. కుటుంబం, కుటుంబవ్యవస్థ శాశ్వత పటిష్టతకు ఆమె ఆలోచన దోహదపడతుంది.
మానసిక పరిపక్వత 
1. బాధ్యతలు స్వీకరించడం
2. ఇతరుల నుంచి ప్రేమ కావాలని ఎలా కోరుకుంటామో అలా ఇతరులకు ప్రేమను అందించగలిగే మానసిక సామర్థ్యం కలిగి ఉండడం.
3. అనుకున్నప్పుడే అన్నీ జరగాలి అన్నట్టు కాకుండా వయసులో చెలరేగే తన కోర్కె అప్పుడే తీరాలని ఆత్రపడటం కాకుండా అందుకు కొంతకాలం శ్రమ, పట్టుదల అవసరమవుతాయని అర్థం చేసుకుని అందుకు తగిన సమయానికి వేచి చూడగలగడం.
టీనేజ్‌ దాటి యుక్తవయసులోకి చేరుకున్న ఏవ్యక్తి అయినా ఈ మూడు మనోస్థైర్యాలను సంతరించుకోకపోతే మానసికంగా ఇంకా టీనేజ్‌ దశకే కట్టుబడి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అంతేకాదు టీనేజ్ దశ అనేది మానసిక అపరిపక్వత నుంచి పరిపూర్ణత్వాన్ని సాధించడానికి ఎదిగే దశ అని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మానసిక అపరిపక్వత అధిగమించేందుకు టీనేజర్స్‌కి అవరోధంగా నిలిచే ముఖ్య అడ్డంకులు రెండుంటాయి. ‍
1. వారి లోపలి నుంచి ఎవరికీ చెప్పుకోలేకుండా, బయటకి రాకుండా ప్రయత్నించే సెక్స్‌ ప్రోద్బలాలు
2. తల్లిదండ్రుల కేరింగ్‌..
తల్లిదండ్రుల కేరింగ్‌ :
ఇక కోరికలను‍‍ రెచ్చగొట్టే వివిధ రకాల కారణాలు ఒకటైతే రెండోది తల్లిదండ్రుల సంరక్షణ. అదేంటీ? తల్లిదండ్రుల ప్రేమ ఎలా కారణం అనుకుంటున్నారా? టీనేజ్‌లోకి ప్రవేశించక ముందు వరకు తల్లిదండ్రుల సంరక్షణ, ప్రేమ వాళ్లకు ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ పెద్దవుతున్నాం, స్వతంత్రులం కావాలి అనే తపన టీనేజ్‌లో ప్రారంభమవుతుంది. అందుకనే తరచు తల్లిదండ్రులతో విభేదిస్తూ తిరుగుబాటు ప్రదర్శిస్తుంటారు. ఈ తిరుగుబాటు ఎందుకు జరుగుతుందో తల్లిదండ్రులకు అర్థం కాదు. మాటిమాటికీ అభిప్రాయాలు, దుస్తులు, స్నేహితులు, చదివే పుస్తకాల విషయాల్లో తమ పిల్లలు తమతో విభేదిస్తూ, తమ పెద్దరికాన్ని, ఆధిపత్యాన్ని తృణీకరిస్తోంటే ఏవో పునాదులు కదిలిపోతున్నట్లు అనిపిస్తుంది. పిల్లలు చెడిపోతున్నారనిపిస్తుంది. కేకలేయడం, దండించడం ద్వారా అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు.
టీనేజ్‌ యువతీయువకులు సెక్స్‌ సంబంధాల కన్నా చుంబనాలు, ఆలింగనాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వెల్లడైందని ఓ సర్వేలో తేలింది. టీనేజ్‌లో సెక్స్‌, ముద్దు, కౌగిళ్లు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. సహచర్యం, నవ్వులు, జోకులతో పాటు యవ్వన సంబంధాలు (సెక్స్‌) గురించి కూడా ఈ సర్వేలో ఆరా తీశారు. సెక్స్‌ సంబంధాలకంటే ఆలింగనాలు, చుంబనాలకే ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారనీ, ముఖ్యంగా పురుషులు సెక్స్‌ సంబంధాలపై మక్కువ చూపడం లేదని సర్వేలో తేలింది. ఇటువంటి పనులతో వారు అమితానందం పొందుతున్నారనీ ఇలాంటి సమయంలో వారికి రతిక్రియలో పాల్గొనాలన్న కోరిక బలీయంగా ఉన్నప్పటికీ దాన్ని పక్కనబెట్టి మిన్నకుండిపోతున్నారని వెల్లడైంది.
ప్రైవసీ ఇవ్వండి
ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు స్నేహితుల్ని ఏర్పరుచుకుని వాళ్లతో తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు అదేమిటి అంటూ ప్రశ్నించకూడదు. వారి స్నేహన్ని అర్థం చేసుకోండి. నిజమైన మంచి స్నేహితులనుకుంటే మీరే వారి స్నేహాన్ని ప్రోత్సహించండి అంతే తప్ప స్నేహితులే వద్దని అనకూడదు. వాళ్లు మరీ చెడు స్నేహితులనిపించినప్పుడు సలహాలు అందించవచ్చు. టీనేజర్స్‌కి కూడా ఏకాంతం కలగనీయడం మంచిది. అంటే వారికి సపరేట్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయడం, ప్రైవసీ కలిగించడం లాంటివి అన్నమాట. ప్రైవసీ కల్పించాక కూడా వారిని ఏం చేస్తున్నావు అంటూ మాటిమాటికీ అనుమానించే విధంగా ప్రశ్నించడం తగదు. ఒకవేళ మీకేమైనా అనుమానం కలిగితే నేరుగా వారినే అడగడం లేదా వారి రూమ్‌లో వెతకడంలాంటివి చేసి నిజం నిర్థారణ తర్వాతే వారిని ప్రశ్నించాలి. అలా ప్రైవసీ ఇవ్వడం వల్ల వారు పూర్తి స్వతంత్రంగా మెలగడానికి టీనేజ్‌లోనే ప్రాక్టీస్‌ చేస్తున్నాడనుకోవాలి. ఆ ప్రాక్టీస్‌ కోసం తల్లితండ్రులు సహకారం అందించాలి. సలహాలు అందివ్వాలి. ఒకవేళ వాళ్లు తమ సలహాలను తిరస్కరిస్తే కోపం తెచ్చుకోకూడదు. స్వతం ఆలోచనలు చేయగలుగుతున్నారని సంతోషించాలి. అయితే ఒక విషయం టీనేజర్స్‌ ఎంతగా స్వంత ఆలోచనలవైపు స్వంత నిర్ణయాల వైపు మొగ్గు చూపినా తల్లిదండ్రులు తమపట్ల శ్రద్ధ వహించాలని ఆసక్తి ప్రదర్శించాలని లోలోపల కోరుకుంటారు. తాము సాధించే కార్యాలను తల్లిదండ్రులు మెచ్చుకోవాలని కోరుకుంటారు. అలా జరిగినప్పుడు తమ పట్ల విశ్వాసం పెంచుకుంటారు.
]]>