నేను బిచ్చగాణ్ణే అంటున్న విజయ్

“యమన్” హీరో విజయ్ ఆంటోని ఏమంటున్నాడో  తెలుసా 

ప్రస్తుత తమిళ రాజకీయాలకు ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని.ఈ సినిమా కథ ని ఐదు సంవత్సరాల క్రితమే డైరెక్టర్ జీవ శంకర్ రాసారని అన్నారు.జయలలిత మరణం తమిళనాడు కి తీరని లోటు అని,ఆవిడా సింహం లాగా బ్రతికారని,అంత త్వరగా మరణిస్తారని ఎవరు అనుకోలేదని అన్నాడు.

*రాజకీయనాయకులు ఎలా ఆలోచిస్తారో మాకు తెలిసినా , అది ప్రతి ఒక్కరికి తెలిసేలా చెప్పాలని ఈ సినిమాని డిఫెరెంట్ యాంగిల్లో చేసాం అన్నారు.ఒక సామాన్య వ్యక్తి మంత్రి ఎలా అయ్యాడనేది ఈ చిత్ర కథ.

* యమన్ అంటే ధర్మాన్ని కాపాడే యమధర్మరాజు అని అర్ధం,మహా శివుని అవతారాలలో ఒకటి,ఈ సినిమాలో నేను తప్పుడు రాజకీయాలు చేసే వారి పాలిట యముణ్ణి అన్నారు.

*తమిళం లో నా సినిమాలు నేనే నిర్మిస్తా,బిచ్చగాడు సినిమా తీసే వరకు నేను బిచ్చగాడినే, ఆ సినిమా క్లైమాక్స్ లో మిలినియర్ అయినట్లు బిచ్చగాడు సినిమా తర్వాత నేను అలా అయ్యాను.ఎన్ని డబ్బులు ఉన్న మూడు సార్లు కంటే ఎక్కువగా తినలేం కదా

*తర్వాత చిత్రాలలో కూడా నేను హీరో పాత్రలే చేస్తాను.అతిధి పాత్రలు,విలన్ పాత్రలు చెయ్యను అని విజయ్ ఆంటోని …

]]>