నా శిష్యుడిపై పోరాటాని నేను సిద్ధo…అన్నా హజారే

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని రాలెగాన్ సిద్ధి గ్రామంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన అన్నా హజారే.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్,తన మాజీ సహచరుడు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కపిల్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాతే కేజ్రీవాల్ అక్రమాలపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.కపిల్ మిశ్రా మంత్రిగా ఉన్నప్పుడు డబ్బు మార్పిడి జరిగితే ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు రుజువైతే నేను వ్యక్తిగతంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతానని పేర్కొన్నారు అన్నా హజారే.జంతర్ మంతర్‌లోధర్నా చేపట్టి,కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తానని ఆయన తెలిపారు. కాగా, తన కేబినెట్ సహచరుడి నుంచి రూ.2 కోట్లు తీసుకున్నాడని మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఖండించారు.

 ]]>