ట్రిపుల్ తలాఖ్ ఆర్గ్యుమెంట్ లో అయోధ్య రాముడు

సుప్రీమ్ కోర్ట్ లో ట్రిప్ తలాఖ్ అంశం మీద గత రెండు రోజులుగా  వాదనలు జరుగుతున్నా విషయం తెలిసిందే ..తాజా వాదనల్లో భాగం గా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున కాంగ్రెస్ నాయకుడు అడ్వకేట్ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు .తాజా వాడనో కపిల్ సిబాల్ రాముడిని కూడా  మ్యాటర్లో ఉదాహరణగా తీసుకొని వాదన చేసారు .శతాబ్దాల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ట్రిపుల్ తలాఖ్ అని ఈ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధం అని ఎలా భావిస్తారని ప్రశ్నించారు .నైతికత విశ్వాసం అనే అంశాలకు తావు లేదని సిబాల్ వాదన అంతే కాదు హిందువుల ఆరాధ్యుడైన శ్రీ రాముడు అయోధ్య మందిరం విషయం కూడా సిబాల్ ప్రస్తావిస్తూ రాముడి  మీద వున్నా నమ్మకాన్ని ప్రశ్నించలేనపుడు ట్రిపుల్ తలాఖ్ విషయం లో కూడా అదే వర్తిస్తుంది కదా అనేది సిబాల్ వాదన,

రాముడు అయోధ్యలో జన్మించాడనేది నా విశ్వాసం, దీనికి రాజ్యాంగ నైతికత లేదని జస్టిస్ జేఎస్ ఖేర్‌తో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి తెలియజేశారు. ముస్లింల వివాహం, విడాకులంటే నిఖానమా ద్వారా పెద్దల అంగీకారంతో చేసుకునే ఒక ఒప్పందం లాంటిదని అన్నారు. ఈ రెండు ఒప్పందం అయినప్పుడు దీన్ని ఎందుకు సమస్యగా చూడాలని గట్టిగా వాదించారు. ట్రిపుల్ తలాక్ హిదత్‌లో ఉందని, ఇది మహ్మద్ ప్రవక్త తర్వాత అమల్లోకి వచ్చిందని సిబల్ పేర్కొన్నారు. జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారిమన్, యూయూ లలిత్, అబ్దుల్ నజీర్ ధర్మాసనం ముందు ముస్లిం పర్సనల్ లా బోర్డు తన వాదనలను వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా వాట్సాప్ లో ఈ -తలాఖ్ తీసుకోవడం పై తమ అభిప్రాయాన్ని తెలపాలని అపెక్స్ కోర్ట్ aimplb ని కోరింది .ఇదిలా ఉండగా ట్రిపుల్ తలాఖ్ పై నిన్న కేంద్రం కొత్త విడాకు చట్టాన్ని తీసుకొస్తామనికోర్టుకు  చెప్పిన విషయం తెలిసిందే

 ]]>