ఆంధ్ర లో దోమల పై దండయాత్ర….

ఆంధ్రలో దోమల దండయాత్రకు అక్కడి ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు కంకణమే కట్టారనుకోవాలి.దోమల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తమ పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే పరిస్థితులు కల్పిస్తే ఆయా ప్రాంతాల యజమానులపై జరిమానా విధించనున్నారు. అంతేకాదు జైలుకు కూడా పంపించనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.త్వరలోనే బిల్లు చట్టరూపం దాల్చనుంది.

నివాస గృహాలు, రహదారుల పక్కన తోపుడు బళ్లు పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే వాతావరణం సృష్టిస్తే తొలిసారి రూ. వెయ్యి జరిమానా విధిస్తారు.చెప్పిన తర్వాత కూడా అలంటి వాతావరణాన్ని సరిదిద్దకపోతే రూ. ఐదు వేలు ఫైన్‌ వేస్తారు. భవన నిర్మాణ స్థలాలు, హోటళ్లు, ఆహార నిల్వ సంస్థలు, కల్యాణ మండపాలు, మైనింగ్‌ ప్రాంతాలు, ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లకు తొలిసారి రూ. 25 వేలు.. రెండోసారి రూ. 50 వేలు జరిమానా విధిస్తారు. దీంతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంది. కేంద్ర సంస్థలు ఐన రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు, ఓడరేవులు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఈ నిబంధనలు తప్పవు.

]]>