ద్రవ పదార్దాల పై ఎక్కువ దృష్టి పెట్టాలి.వేసవికాలంలో పోషకాహారంతో పాటు మంచినీరు,పళ్ళ రసాలు,మజ్జిగ వంటి ద్రవ పదార్దాలును ఎక్కువగా తీసుకోవాలి. వేసవిలో రోజూ తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరo చల్లపడి శరీర ఉష్ణోగ్రత అదుపోలో ఉంటుంది.శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేసి… దగ్గును, జలుబును నివారిస్తుంది.
ఇంకొన్ని జాగ్రత్తలు;
**పుదీనాను ఎండాకాలంలో వీలైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిది.రకరకాల వంటల్లో పుదినాని వాడుతుంటే,ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
**పుచ్చకాయను వేసవిలో తీసుకోడం అతి ముక్యం.వేసవిలో పుచ్చకాయను తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్లో ఉంచుతుంది.
**నిమ్మకాయ శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.వేసవి లో నిమ్మరసం లాంటి ద్రవ పదార్దాలు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
**కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత నీరు అంది జీర్ణ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది.
**వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండాం సహాయ పడుతుంది. ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలను పోగొడుతుంది.శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది.
**జామకాయలో విటమిన్ ‘సీ’ పుష్కలంగా ఉంటుంది.వీలతే ఇదికూడా తీసుకుంటుండాలి.]]>