హెచ్ 1B వీసా పై నిర్మలా సీతారామన్ మాట

అమెరికా నూతన హెచ్ 1B వీసా విధానం పై అక్కడి నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన విధానాలు విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల దృష్టికి తెచ్చారు, ప్రశాంత వాతావరణం ఉంటే తప్ప వ్యాపారాలు చేసే పరిస్థితి లేదని ఆమె చెప్పుకొచ్చారు, అంతేకాదు విధి విధానాల్లో పారదర్శకత ఉంటే తప్ప ముందుకు వెళ్లలేమని స్పష్టంచేశారు, అంతే కాదు వీసా వ్యవహారం గాలిలో దీపం లా ఉందని అన్నారు , పర్యటనకి వచ్చిన అమెరికన్ కాంగ్రెస్ బృందం మాత్రం కొత్త ప్రభుత్వం కుదురుకునే వరకు వేచి చూస్తున్నట్టు చెప్పారు నూతన హెచ్ 1B వీసా విధానం భారత్ ఐటీ రంగం మీద తీవ్ర ప్రభావం చూపించ బోతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ బృందం తమ వంతు పాత్ర ను వీసా విధానం లో పాటిస్తుందనే ఆశాభావం నిర్మల వ్యక్తం చేసారు .

]]>