తాగి డ్రైవ్ చేసి ప్రమాదం తెచ్చిన వారికి ఇన్సూరెన్స్ కట్….

ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సార్లు హెచ్చరించాయి అయిన ప్రమాదాలు తగ్గలేదు ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్  లో పట్టుబడిన వారికీ భారీగా జరిమానా విధించడం, వాహనాలను సీజ్ చెయ్యడం వంటివి చేశారు.అయినా కొందరు రూల్స్ ను బ్రేక్ చేస్తూనే  ఉన్నారు.ఇప్పుడు తాగి రోడ్డు ప్రమాదాలు చేసే వారిపై మరింత కఠినంగా వ్యవహారించేందుకు కేంద్రప్రభుత్వం రoగం సిద్దం చేసింది డ్రంక్ డ్రైవర్లకు మరింత షాకిచ్చేలా రోడ్డు ప్రమాదంలో ఎవరికైనా హాని కలిగిస్తే,వారికి పూర్తి నష్టపరిహారం డ్రైవర్లే చెల్లించేలా ప్రభుత్వం చట్టాన్ని సవరణ చేస్తోంది.

దీనికి సంబంధించిన మోటార్ వెహికిల్స్ బిల్లును కేంద్రప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది.ఇక పై మద్యం సేవించి డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు చేస్తే ఆ కేసులకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి నష్టపరిహారాలు చెల్లించవని,మోటార్స్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం రోడ్డు ప్రమాదాలు చేపట్టే డ్రంక్ డ్రైవర్లే మొత్తం నష్టపరిహారాలను భరించేలా బిల్లు ప్రతిపాదించింది.ఇదే కాకుండా రోడ్డు ప్రమాదాలు చేసిన డ్రంక్ డ్రైవర్లకు నాన్ బెయిలబుల్ నేరం, 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేయనున్నారు.పార్లమెంటరీ ప్యానల్ లో ఈ ప్రతిపాదనను రోడ్డు రవాణామంత్రిత్వ శాఖ ఆమోదించింది.

]]>