ఇక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత…..

ఉదయం లేస్తూనే దేవుడు మొహాలు చూసే రోజులు పోయి,వాట్స్ ఆప్,పేస్ బుక్,ప్రొఫైల్ పిక్స్ మార్చుకొనే రోజులు వచ్చాయి.అర్ద రాత్రి 1 వరకు కూడా సమాజం సోషల్ మిడియలకే అకింతం అయ్యింది.దిన చర్యలనైన మర్చిపోతున్నరేమో కానీ సోషల్ మీడియా ప్రచార సాధనాలను మాత్రం విచ్చల విడిగా వాడుకుంటున్నారు.అంటే అంతల సోషల్ మీడియా కి భానిసలయ్యరన్న మాట,ఒక్క రోజు ఫోన్ కానీ ట్యాబు కానీ పని చేయకపోతేనే అలవాటైన వాళ్ళకి పిచ్చి లేస్తుంది.కానీ  జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నెల రోజుల పాటు మోబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.అసత్యాలను, తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే ఇందుకు కారణం.

ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా రాష్ట్రంలో గొడవలు సృష్టించిన వారిపై కొరడా ఝళిపించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. నెల పాటు మోబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వేర్పాటు వాదులకు ఆసరాగా నిలుస్తున్న 22 సోషల్‌ వెబ్‌సైట్లను నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వెలువరించేందాకా ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌కే గోయల్‌ వెల్లడించారు. అసాంఘిక శక్తులను, జాతి వ్యతిరేక వాదులను కట్టడిచేసేందుకు ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో అల్లర్లకు కారణమవుతూ అసత్యాలను, తప్పుడు వార్తలను పంపుతున్న 350వాట్సాప్‌ గ్రూపులను గుర్తించిన అధికారులు ఇప్పటికే 90 శాతం వరకు మూసివేయించారు. ఈనెల 17వ తేదీన కూడా ప్రభుత్వం మోబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలుపుచేసింది.

మనం ఒక పని చేస్తున్నాం అంటే దానికి సమాజం నాశనం అవ్వకూడదు.సమాజం బాగుపడెల ఉండాలి. ప్రతి ఒక్కరం సమాజం లో భాగమే,సోషల్ మీడియాను మంచి కి మాత్రమే వాడుదాం…..

]]>