మాంసం,వధ దుకాణాలకు లైసెన్స్ ఇచ్చేయండి ..

గోవధ..గోవధ శాలలు..ఈ టాపిక్ ఆదిత్య ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి అయిన తర్వాత ఊపందుకుంది ఆ వెంటనే గోవధ శాలలు  మాంసం దుకాణాలు మూతబడటం చాల స్పీడ్ గా జరిగిపోయాయి ..ఐతే తాజా గా ఈ  విషయం మీద అలహాబాద్ కోర్ట్ ఉత్తర్వులిచ్చింది..చట్ట ప్రకారం లైసెన్స్ ఇవ్వాలని  అంతే కాకుండా ఆధునిక మైన వధశాలలను ఏర్పాటు చేయించాలని సూచించింది .2006 ఫుడ్ సేఫ్టీ నిబంధనల  ప్రకారం మాంసం, వధశాలలకు లైసెన్స్ ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.ఈ విషయం లో ఏమైనా అవాంతరాలొస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది .మార్చ్ 31తో ఇప్పటికే ఇచ్చిన లైసెన్స్ గడువు ముగుస్తుండటం తో కొందరు దుకాణ దారులు కోర్ట్ ను ఆశ్రయించి తమ లైసెన్స్ లను రెన్యూవల్ చేయాలనీ కోరారు ఈమేరకు కోర్ట్ ఈ సూచనలు చేసింది .ఐతే స్థానిక పరిస్థితులు ప్రభావాన్ని బట్టి ఈ దుకాణాలు ఉండాలి లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని బెంచ్ పేర్కొంది .

]]>