విజయవాడకి ఐటీ కంపెనీలొచ్చేశాయి ..

ఆంధ్రపదేశ్‌లో ఐటీ విస్తరణకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విజయవాడంలోని మేథా టవర్స్‌లో ఏడు ఐటీ కంపెనీలు నేటి నుంచి కార్యకలాపాలను మొదలు పెట్టాయి. దీనికి సంబంధించి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఇవాళ ఈ కంపెనీలను ప్రారంభించారు. ఈ కంపెనీలలో మొత్తం 1,650 మందికి పైగా ఉద్యోగులు పని చేయనున్నారు.

ఇదిలా ఉంటే మేథా టవర్స్‌లో స్పెయిన్‌కు చెందిన గ్రూపో అంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, ఎంఎన్సీ రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా, చందుసాఫ్ట్, ఈసీ సాఫ్ట్, యమైహ్ ఐటీ సొల్యూషన్స్ ఉన్నాయి. మరిన్ని ఐటీ కంపెనీల కోసం ఈ భవనం పక్కనే మరో భారీ భవనాన్ని నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

]]>