బుల్లితెర హాస్యనటుడు, జబర్దస్త్ ఫేమ్ వినోద్,ఇలా అంటే బహుశా అర్ధం అయ్యుండక పోవచ్చు వినోదిని అంటే అర్ధం అవుతుంది.జబర్దస్త్ లో మహిళా పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్ స్వస్థలం వైఎస్సార్ జిల్లా. ఇతని తల్లి శిరోమణమ్మ సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లా సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటోంది.
శిరోమణమ్మ అల్లుడు చనిపోవడంతో పెళ్లీడుకొచ్చిన మనవరాలు అనాథగా మిగిలింది. ఈమె ఆలనాపాలన లక్ష్మమ్మ చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈమెను వినోద్‌కు ఇచ్చి వివాహం చేయాలని బంధువులు భావించారు.ఈ విషయం వినోద్ తో చర్చించగా అతని నిర్ణయం వేరుగా ఉంది.ఐతే బలవంతంగానైనా పెళ్లి చేయాలనుకున్నారు వినోద్ కుటుంబ సభ్యులు.
ఆదివారం రాత్రి వినోద్‌ను కిడ్నాప్ చేసి బొందలదిన్నెకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పెనుగులాటలో వినోద్ కుడి చేయికి స్వల్ప గాయమైంది. సోమవారం ఉదయం అక్క కూతురితో పెళ్లి చేయడానికి ప్రయత్నించగా నిరాకరించాడు. ఇంతలో కిడ్నాప్ సమాచారం పోలీసులకు అందడంతో సంజామల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వినోద్ కిడ్నాప్ ఉదంతం కర్నూలు జిల్లాలో కలకలం రేపింది.వినోద్‌తోపాటు బంధువులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. కిడ్నాప్ విషయమై వినోద్‌ను విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని అన్నాడు .బందువులే బలవంతంగా పెళ్లీ చేయడానికి ఇదంతా చేస్తున్నారా?అనేది వినోద్ నోరు తెరిస్తే తప్ప అసలు విషయం తెలియదు.
]]>