కమల వికాసం ..మోడీకి జై అంటున్న జగన్

 ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.అనంతరం ఆయన మాట్లాడుతూ  అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీని పై విచారణ జరిపి,బాధితులకు న్యాయం చేయాలని ప్రధానిని కోరినట్లు జగన్ స్పష్టం చేశారు.ఈ అంశంపై సీబీఐ విచారణ వేయాలని,ఈ వ్యవహారంలో టీడీపీ నేతల పాత్ర ఉందని ఆరోపించారు.

మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రధానిని కోరామన్నారు జగన్.రూ. 5వేల మద్దతు ధర సరిపోదని,మిర్చికి రూ. 8వేలు మద్దతు ధర కల్పించాలని ప్రధానిని కోరినట్లు జగన్ తెలిపారు. మొత్తం రాష్ట్రంలో 50 లక్షల క్వింటాళ్ల మిర్చి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం వ్యవహారం వల్లే ఏపీలో రైతులకు అవస్థలని ఆరోపించారు జగన్. ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభ పెట్టారని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు జగన్ చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. ప్రధాని ని కలిసిన అనంతర ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఎలాగు ఓడిపోతామనుకున్నప్పుడు పోటీ పెట్టడం సరైంది కాదని,రాష్ట్రపతి పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమే మంచిదని జగన్ అభిప్రాయపడ్డారు. బీజేపీతో వైసీపీ విభేదించేది ప్రత్యేక హోదా అంశంలో మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తే,కేంద్రంలో వారికి మద్దతిస్తామని జగన్ స్పష్టం చేశారు.హోదా విషయంలో, భూసేకరణ బిల్లు విషయంలోనే ‌కేంద్రంతో విబేధించామని,ప్రజలకు మంచి చేసే అన్ని విషయాల్లో ఎన్డీఏ నిర్ణయాలను సమర్థిస్తున్నామని జగన్ అన్నారు. “ఒకే దేశం-ఒకే ఎన్నిక” అన్నది జరిగితే మంచిదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక కోసమే తనకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చారన్నది సరికాదన్నారు జగన్.

]]>