ఎంత చిన్న నటుడైన సరే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలంటే రాజమౌళి చేతిలో పడాలనుకోవడం లో ఎ మాత్రం సందేహం లేదు.అందుకో ఏమో స్టార్ హీరోలకు సైతం జక్కన్న మాక్కావాలంటే మాక్కావాలి అంటూ వెంబడిస్తున్నారు.టాలీవుడ్ నుంచి ఓ ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్స్.జక్కన్నకు అడ్వాన్సులు ఇచ్చి వెయిటింగులో ఉన్నారని తెలిసిందే.వారికి ఖచ్చితంగాసినిమాలు చేయాల్సిందే.
జూనియర్ ఎన్టిఆర్ మూడు సినిమాలు చేశాడు. ఇప్పుడు నాలుగో సినిమా చేయాలని తహతహలాడిపోతున్నాడు. అవకాశం కోసం రాజమౌళి ఫ్యామిలీని అతడు ప్రభావితం చేశాడని, అట్నుంచి నరుక్కొస్తున్నాడని వార్తలొచ్చాయి. ‘జై లవ కుశ’ పూర్తయిపోగానే వచ్చి జక్కన్న ముందు వాలిపోతానని ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా చెప్పాడట.
ఎప్పటినుంచో జక్కన్న కాల్షీట్లు ఇస్తే అఖిల్‌ని అతడి చేతిలో పెట్టాలని కింగ్ నాగార్జున అనుకుంటున్నారు .అఖిల్ స్టార్‌డమ్‌ని అమాంతం పెంచేయాలంటే రాజమౌళి అయితేనే సరైన గురువు అన్నది నాగార్జున లెక్క. నాగార్జున తనకి అత్యంత సన్నిహితులైన విజయేంద్ర ప్రసాద్, కీరవాణితో ఇప్పటికే లాబీయింగ్ చేస్తున్నాడన్న సమాచారం ఉంది.
అలాగే ‘ఈగ’తో తనకో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన రాజమౌళి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు నాని. ఇక మిగతా హీరోలు కూడా తమకో వరం ఇస్తే అందుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీగా కాదు. ఇప్పటికైతే ఎన్టీఆర్, అఖిల్, నాని వరకూ ఆ ఛాన్స్ ఉంటుంది.
మరోస్టార్ హీరో మహేష్ సైతం రాజమౌళితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అది కూడా మిస్సవుతోంది. ఒకవేళ రాజమౌళి తనే స్వయంగా మహేష్‌తో చేస్తానని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న విరామం కోసం టూర్ వెళ్లాడు. తదుపరి వచ్చాక ఏ హీరోకి ఛాన్స్ ఇస్తాడు?ఎవరిని కరుణిస్తాడో వేచి చూడాలి.
]]>