"ముందస్తు" హడావుడి అప్పుడే మొదలయ్యిందా !

జమిలి ఎన్నికలు అనుకోవడమే తడవు  అప్పుడే ముందస్తు ఎన్నికల హడావుడి కి తెర తీసినట్టే కనిపిస్తోంది రాజకీయ పార్టీల హడావుడి ఇంకేముంది సందడి షురూ ..ఎన్నికలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పక్షాలు ఆ దిశగా సన్నాహాలు, ప్రజల్లోకి వెళ్లే వ్యూహాల రూపకల్పన, జరగబోతోంది ,అన్ని రాష్ట్రాలది ఒకే అభిప్రాయం ఐతే 2018 చివరలో ఎన్నికలు తధ్యం ఇప్పటికే  నీతి ఆయోగ్‌ సమావేశంలో ఈ దిశగా సంకేతాలు స్పష్టంగా వెలువడ్డాయి .ఎన్నికలు ముందే వస్తాయని కొద్ది రోజుల క్రితమే మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేశారు.ఇటీవల తన మంత్రివర్గాన్ని కూడా పునర్‌వ్యవస్థీకరించారు.

కొద్ది రోజుల్లో వేయబోయే జిల్లా కమిటీల కూర్పు కూడా ఇదే కోణంలో ఉండాలన్న వ్యూహంలో ఆయన ఉన్నారు.ఇదిలా ఉండగా అపరిష్కృతం గా ఉన్న ఎన్నికల వాగ్దానాల్ని సత్వరమే పరిష్కరించి అమల్లోకి తేవాలని అయన యోచన, ప్రధానం గా నిరుద్యోగ భృతి, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల వేగం పెంచాలని కూడా నిశ్చయించారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి ప్రయాణం చేసే వ్యూహంలోనే టీడీపీ ఉండటం కూడా ఎన్నికల ఎత్తుగడలో భాగం కావొచ్చు

ప్రతిపక్షం వైసీపీ కూడా దాదాపు గా ఇదే బాటలో వుంది అనే చెప్పొచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఆయుధాలుగా మలచుకొని ప్రజల్లోకి వెళ్లాలనేది వీళ్ళ ఎత్తుగడ గా కనిపిస్తోంది ఇందుకోసం జగన్ అన్యాన స్పోకెన్ పర్సన్స్ కి సూచనలు ఇస్తున్నారట అంతే కాదు అయన మల్లి యాత్రలు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొంటున్నారట  ఇప్పటికే  ‘గడప గడపకూ వైసీపీ’ పేరుతో ఆ పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానిని మరింత పకడ్బందీగా జరపాలని, అన్ని నియోజకవర్గాల్లో బాగా జరిగేలా చూడాలని కింది స్ధాయి నాయకత్వానికి ఆదేశాలిచ్చారట.మొత్తానికి జమిలి  గుబులు మొదలైనట్టే ఉంది .

]]>