"జనసేన" సిద్ధం ఆడా..ఈడా పోటీకి సై

సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఆపార్టీ కి నేటి తో మూడేళ్లు పూర్తయ్యాయి  ఈ సందర్భం గా హైదరాబాద్ లో  వ్యవస్థాపక అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అయన  పలు విషయాలను స్పష్టం  చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు.జూన్ నుంచి పార్టీ నిర్మాణం ప్రారంభమవుతుందని పవన్ చెప్పారు. ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించామని పవన్ తెలిపారు. పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు, అభిమానులకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వెబ్‌సైట్‌ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. 60 శాతం యువతకు రానున్న ఎన్నికలల్లో సీట్లు ఇస్తామని పవన్ అన్నారు, తెలంగాణ , ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారని , సర్వే లు ఆధారం గా పోటీ చేయమని పొత్తులపై ఇంకా ఆలోచన చెయ్ లేదని అన్నారు ..

]]>