"జనస్వరం" జనసేన అభిమానులకు మాత్రమే అంటున్న పవన్

‘‘జనసేన పార్టీలోని వివిధ విభాగాల్లో జన సైనికులను భాగస్వాములను చేసే కార్యక్రమం ప్రారంభమవుతోంది. పార్టీ తరపున గొంతెత్తడానికి స్థానిక సమస్యలపై, రాష్ట్రస్థాయి సమస్యలపై సమగ్రమైన అవగాహన ఉన్నవారిని స్పీకర్స్ గాను, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గాను, చక్కటి విశ్లేషణలను చేయగలవారిని అనలిస్టులుగా పార్టీకి సేవలందించేందుకు జనసేన అభిమానులకోసం వెతుకుతోంది  మిమ్మల్ని మీ ప్రాంతంలోనే కలుసుకుని మాట్లాడేందుకు జనసేన బృందం హైదరాబాద్ నుంచి మీ జిల్లాకు జన స్వరం గా రాబోతోంది

ఈ కార్యక్రమం ముందుగా అనంతపురం జిల్లా నుంచి ప్రారంభం అవుతుంది. క్రమంగా అన్ని జిల్లాల్లో మొదలవుతుంది. మీరు ఎప్పుడు, ఎక్కడ కలుసుకోవాలో వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం. ముందుగా మీరు చేయవలసిందల్లా మీ పేరును నమోదు చేసుకోవడమే అని జన సేన వెబ్ సైట్  లో ఉంచారు .
ఇందుకోసం www.janasenaparty.org/resourcepersons లింక్‌ను ఓపెన్ చేసి A) స్పీకర్, B) కంటెంట్ రైటర్, C) అనలిస్ట్‌ లలో మీ ప్రాధాన్యత దేనికో తెలియజేయండి. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మీ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. కేవలం అనంతపురం జిల్లా జనసేన కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే ప్రస్తుతం వర్తిస్తాయి.’’ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలంటే అనంతపురం సప్తగిరి సర్కిల్‌లోని శ్రీ బాలాజీ రెసిడెన్సీలో గల పార్టీ ఆఫీసునందు నేరుగా సంప్రదించాలని జనసేన సూచిస్తోంది. జనస్వరం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అందుబాటులో ఉంది.
]]>