శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రేమించుకుందాం..రా, బావగారూ బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, టక్కరి దొంగ, ఈశ్వర్, లక్ష్మీ నరసింహా, శంకర్‌దాదా ఎంబిబిఎస్ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ఉగాది పర్వదినం సందర్భంగా ‘జయదేవ్’ అనే టైటిల్‌ని ప్రకటించారు.
ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కథ ఇది. కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని శాక్రిఫైస్ చేసే ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ల ఇన్స్పిరేషన్తో రూపొందిన క్యారెక్టర్ జయదేవ్. 80 శాతం షూటింగ్ పూర్తయింది.గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్, హరితేజ, శ్రావణ్, సుప్రీత్, కోమటి జయరామ్, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్, అరవింద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.