మరో ఆఫర్ తో షాకిచ్చిన జియో ..మరో రెండునెలలు ఫ్రీ

ఊహించిందే అయ్యింది మరో దిమ్మ దిరిగే ఆఫర్ తో  రిలయెన్స్ జియో ముందుకొచ్చింది మళ్ళి బంపర్ ఆఫర్ ను ఇచ్చింది జియో ప్రైమ్ గడువును మరో 15 రోజులు పొడిగించారు ఇప్పటికే రెండు ఆఫర్ లతో ఇతర నెట్వర్క్ లను నీళ్లు తాగించిన అంబానీ ఇప్పుడు  మరో ఆఫర్ తో పూర్తిగా ఇతర నెట్ వర్కుల పేరు ను మర్చిపోయే లా చేసేందుకు సిద్ధమయ్యారు .

జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం మార్చి 31ఆఖరు కానీ ఆ గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఇప్పటి వరకు జియో ప్రైమ్ మెంబర్షిప్ లో 7 కోట్ల 20 లక్షల మంది కస్టమర్లు చేరారు. ఇలా ప్రైమ్ జియో లో సబ్ స్క్రైబ్ స్పెషల్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు సమ్మర్ సర్ప్రైస్ పేరుతో మరో రెండునెలలపాటు ఉచిత బంపర్ ఆపర్ ను ప్రకటించింది రిలయన్స్ జియో.  ఏప్రిల్ 15 లోపు రూ. 99+303 రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు మొత్తం మూడు నెలలపాటు పాటు జియో ఉచిత సర్వీసులను పొందే అవకాశాన్ని కల్పించింది.దీనిద్వారా రెండు నెలలు రీఛార్జ్ చేసుకోవాల్సిన పనిలేదు. ఈ స్పెషల్ రీచార్జ్ ను  ఏప్రిల్ 15 లోపు చేసుకున్న కస్టమర్లకు కూడా రెండు నెలల ఉచిత ఆఫర్ ఇస్తారు ….

]]>