జియో ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్స్ ఇవే….

రిలయన్స్ జియో తన ప్రైమ్ యూజర్లకు ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేసింది.ఇందులో  రూ.309, రూ.509 ప్లాన్స్ ను కేవలం ప్రీపెయిడ్ యూజర్లకే జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్ డేట్ చేసిన ప్లాన్స్ కింద ధన్ ధనా ధన్ ఆఫర్ ప్రయోజనాలను పోస్టుపెయిడ్ ప్లాన్స్ కు అందిస్తుంది.  రూ.309 లేదా ఇతర ప్లాన్స్ కేవలం జియో ప్రైమ్ యూజర్లకే కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఏ రీఛార్జ్ ప్యాక్ నైనా ప్రైమ్ సభ్యత్వం లేని జియో యూజర్లు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది.

రీచార్జ్ ఆఫర్స్….. 

**19 రూపాయల ప్లాన్ తో రోజంతా 200 ఎంబీ 4జీ డేటాను ప్రైమ్ యూజర్లకు కల్పించనుంది. నాన్ ప్రైమ్ యూజర్లు అయితే 100 ఎంబీ డేటాను పొందనున్నారు.

**రూ.49, రూ.96, రూ.149 రీఛార్జ్ ప్యాక్ లతో ప్రైమ్, నాన్ ప్రైమ్ యూజర్లకు డేటా ఆఫర్లను అందించనున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది.

** తొలిసారి రూ.1999 రీఛార్జ్ చేయించుకున్నవారికి రోజంతా 185జీబీ 4జీ డేటాను అందించనుంది. తర్వాతి నుంచి  125జీబీ 4జీ డేటాను అందించనుంది. ఇది 150 రోజుల ప్లాన్.

**రూ. 4999 రీఛార్జ్ చేసుకుంటే.. తొలిసారి .. 410 జీబీ 4జీడేటా… తర్వాతి నుంచి 350జీబీ 240 రోజులు అందించనుంది.

** రూ.9999 రీఛార్జ్ చేసుకుంటే మొదట 810 జీబీ 4జీ డేటా,తర్వాతి నుంచి 750జీబీ,420 రోజులు పొందవచ్చు.

** పోస్టు పెయిడ్ జియో కస్టమర్లు రూ.309 ప్లాన్ కింద ఫస్ట్ రీఛార్జ్ మూడు నెలల వరకు 90జీబీ డేటాను పొందనున్నారు. రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు.మూడు నెలల వరకు ఈ అవకాశం ఉంది.ఆ తర్వాతి రీఛార్జ్ లకు నెలకు 30జీబీ మాత్రమే పొందవచ్చు.

** 509 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ తో అయితే 180జీబీ 4జీ డేటాను మూడు నెలల వరకు వాడుకోవచ్చు. అంటే రోజుకు 2జీబీను యూజర్లు పొందుతారు. తర్వాతి రీఛార్జ్ కు నెలకు 60జీబీ మాత్రమే పొందుతారు.

** 999 రూపాయల రీఛార్జ్ తో కూడా 180జీబీ డేటానే పొందవచ్చు.కానీ డైలీ వాడకంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు.ఫస్ట్ రీఛార్జ్ తర్వాత రీఛార్జ్ లపై 60జీబీ డేటాను నెలపాటు పొందుతారు.

]]>