తారక్ న్యూ మూవీ లో విలన్ అట

జనతాగ్యారేజ్ సక్సెస్ తర్వాత బాబి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రాబోతోంది  ఇటీవలే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.  ఈ సినిమాలో తారక్ మూడు పాత్రల్లో కనిపిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ మూడు పాత్రలకు తగ్గట్టే తన రూపును మార్చుకోవడానికి ఎన్టీఆర్ భారీ కసరత్తులు చేస్తున్నాడట ఐతే  సినిమాలోని  ఓ పాత్ర కోసం భారీగా బరువు తగ్గాలని డైరెక్టర్ బాబి చెప్పాడట. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 10 నుంచి 15 కిలోల బరువు తగ్గాలని బాబి టార్గెట్ పెట్టాడట. అయితే.. షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. మరి, తక్కవ సమయంలో 15 కిలోలు ఒకేసారి తగ్గడమంటే మాటలు కాదు కాబట్టి..వైద్య చికిత్స తీసుకునేందుకు తారక్ ప్రస్తుతం విదేశాలకు వెళ్లినట్టు టాక్. కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండడం వల్ల తారక్ ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. జూనియర్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్‌లో పాల్గొంటాడని, మే 20న తారక్ జన్మదినం సందర్భంగా మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల కానుంది కాని ట్విస్ట్ ఏంటంటే ఈ  సినిమాలో థర్డ్ యాంగిల్ లో కనిపించే  మూడో పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉండబోతోంది అని అంటున్నారు …

]]>