గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్న జడ్జ్…

కోర్ట్ కి న్యాయం కోసం వెళ్తారు ఆ న్యాయం జరగడమేమో కానీ కొన్ని సంవత్సరాలు పాటు కోర్టుల చుట్టూ తిరగాలి,కేసులతో పాటు సెక్షన్స్ కూడా పెరిగాయి.వీటన్నిటికి సులభ పరిష్కారం చూపించారు జస్టిస్‌ తేజ్‌ బహదుర్‌ సింగ్‌.ఈయన ఉత్తరప్రదేశ్‌ లోని ముజాఫర్‌ నగర్ కుటుంబ న్యాయస్థానం ప్రిన్సిపల్‌ జడ్జి గా వ్యవహరిస్తున్నారు.పెండింగ్‌ కేసులను తగ్గించి, పిటిషనర్లకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో పనిచేసారు ఫలితం సాదించారు.తక్కువ సమయం లో ఎక్కువకేసు లను పరిష్కరించి.అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.327 రోజుల్లో 6,065 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించారు. జిల్లాలో న్యాయవాదులు సమ్మె చేసినప్పటికీ ఆయన ఈ ఘనత సాధించడం విశేషం.దేశంలో అత్యధిక కేసులు పరిష్కరించిన ఘనత తనదే.విడిపోవాలనుకున్న 903 జంటలను మళ్లీ కలిపారు.జస్టిస్‌ తేజ్‌ బహదుర్‌ సింగ్‌ పేరును ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయనున్నట్టు గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకులు వెల్లడించారు.

]]>