జూనియర్ "జై లవకుశ" ..ఫస్ట్ లుక్ అదరహో

జూనియర్ఎ న్టీఆర్ 27 టైటిల్ లోగోను శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. బాబీ డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జై లవకుశ టైటిల్ ను ఖరారైంది. శ్రీరామ రఘురామ.. జై జై సీతారామా అన్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ నందమూరి అభిమానులకు పండుగ తీసుకొచ్చింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులో ముందుగా శ్రీరాముడు, లక్ష్మణుడు కనిపించగా.. రావణాసురుడు ఉగ్రరూపంలో కనిపించారు. అనంతరం జై జై  టైటిల్ సాంగ్ తో ముగుస్తుంది. ఊహించినట్లుగానే జై లవకుశ టైటిల్ ఖరారు కావడంతో సంబర పడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ మొట్ట మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఒక పాత్ర నెగెటివ్ గా ఉంటుంది. మరో పాత్ర లవకుమార్ గా, ఇంకో పాత్రలో జైగా నటిస్తున్నారు. రాశీఖన్నా, నివేధా థామస్ కథానాయికలు. ఈ చిత్రం దసరాకు రిలీజ్ కానుంది. NTR ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ ఈ చిత్రానికి పనిచేస్తుడటం విశేషం. సంగీతం దేవీ శ్రీ ప్రసాద్.

[embed]https://www.youtube.com/watch?v=yyY29DfPkwk[/embed]]]>