కళాసుధ 19వ ఉగాది పుర‌స్కారాల వేడుక…

శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఉగాది సందర్బంగా అందిస్తున్న సినిమా అవార్డుల వేడుక చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అథితిగా ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి  మండలి బుద్ధప్రసాద్, పారిశ్రామిక వేత్త రమేష్ దాట్ల, మువ్వా పద్మయ్య, విజయ చాముండేశ్వరి, నటుడు, మా అధ్యక్షుడు  శివాజీ రాజా, రఘుబాబు, ఆర్పీ పట్నాయక్, హీరో రోషన్, తదితరులు పాల్గొన్నారు. ఈ  సందర్బంగా పలువురు సినీ అవార్డు గ్రహీతలకు మండలి బుద్ధా ప్రసాద్   అవార్డులు అందచేసీ సత్కరించారు.  ఈ వేదికపై మహిళా రత్న అవార్డును ప్రముఖ పారిశ్రామిక వేత్త కరుణ గోపాల్ కు అందజేశారు.

ugadi2
 ఘనంగా జరిగిన ఈ వేడుకలో అవార్డులు అందుకున్న వారు  
ఆర్పి పట్నాయక్ ( ఉత్తమ సామజిక చిత్రం – మనలో ఒకడు) 
రోషన్ ( ఉత్తమ నూతన నటుడు –  నిర్మల కాన్వెంట్ )
నందిత శ్వేతా ( ఉత్తమ నూతన నటి – ఎక్కడికి పోతావు చిన్నవాడా )
వంశీ పైడిపల్లి ( ఉత్తమ దర్శకుడు – ఊపిరి )
ఎం రాజా ( ఉత్తమ కథ – ధ్రువ )
పరశురామ్ – ( ఉత్తమ మాటల రచయిత- శ్రీరస్తు శుభమస్తు )
వి ఐ ఆనంద్ ( ఉత్తమ కథనం – ఎక్కడికి పోతావు చిన్నవాడా ) 
చైతన్య ప్రసాద్ ( ఉత్తమ పాటల రచయిత )
కె సి అమృత వర్షిణి ( ఉత్తమ గాయని – పెళ్లి చూపులు) 
చందు మొండేటి – ( ప్రత్యేక జ్యురి అవార్డు – ప్రేమమ్ )
ప్రత్యేక జ్యూరీ నటుడు – రాకేందు మౌళి, 
ఉత్తమ హాస్యనటుడు – రఘుబాబు తదితరులు ఈ అవార్డులు అందుకున్నారు.  
]]>