పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు భారీ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది.అచ్చమైన తెలుగింటి పంచెకట్టు తో చేనేత బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న మన కాటన్ రాయుడు మరో కొత్త లుక్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాడట.తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గురు తమ్ముళ్లకు పెద్ద అన్నయ గా కనిపించిన పవర్ స్టార్ నెక్స్ట్ మూవీ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా కనిపిస్తాడట
పవన్ ఒక్కో సినిమాకి సినిమాకి మధ్య కొంత గ్యాప్ తీసుకుంటాడు కానీ ఇప్పుడు తీయ బోయే ఈ కొత్త సినిమాని నాలుగు నెలలోనే మన ముందుకు తీసుకు వస్తారట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.అంటే ఈ సంవత్సరం లోనే పవన్ కళ్యాణ్నటించిన రెండు సినిమాలు చూడొచ్చన్నమాట. ఏప్రియల్ నుంచి పవన్ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అవబోతోంది అని ఫిలిం నగర్ లో టాక్ .ఈ సినిమా కి హీరోయిన్ గా కీర్తి సురేష్ అప్పుడే రెడీ అయ్యిందట
]]>