ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న అనుమాలకు తెర పడింది.బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది ఈ రోజు బాహుబలి 2 గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అంచనాలని మించి ఉన్న బాహుబలి సినిమా రివ్యు మీకోసం….
బాహుబలి(ప్రభాస్)ను రాజమాత శివగామి(రమ్యకృష్ణ)మహిష్మతి రాజ్యానికి మహరాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండటంతో బాహుబలి కట్టప్ప(సత్యరాజ్)తో కలిసి దేశపర్యటనలో భాగంగా కుంతలజలపాతం దగ్గరకు వెళతాడు. అక్కడ కుంతల రాజ్యం యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే తను ఓ రాజ్యానికి రాజు కాబోతున్నాడన్న సంగతి దేవసేన దగ్గర దాస్తాడు.
ఓ సారి కుంతల రాజ్యానికి పెను ప్రమాదం రావడంతో బాహుబలి కాపాడతాడు. బాహుబలి- దేవసేన ప్రేమ విషయం భళ్లాలదేవకు ఒక సేనాధిపతి చేరవేస్తాడు. దేవసేన చిత్రపటాన్ని చూసిన భళ్లాలదేవ ఆమె తనకే దక్కాలని భావిస్తాడు. ఈ సంగతి తన తల్లి అయిన శివగామికి తెలియజేస్తాడు భళ్లాలదేవ. కొడుకు కోరికను కాదనకుండా దేవసేనను భళ్లాలదేవకు ఇచ్చి పెళ్లి జరిపించేందుకు అంగీకరిస్తుంది శివగామి.
బాహుబలి దేవసేనల ప్రేమ వ్యవహారం రాజమాతకు తెలియకపోవడంతో దేవసేనను తీసుకురావాల్సిందిగా బాహుబలిని ఆజ్ఞాపిస్తుంది రాజమాత. అయితే రాజమాతకు విషయం తెలిసిందేమోనని భావించిన భాహుబలికి షాక్ తగులుతుంది. దేవసేనను భళ్లాలదేవుడికిచ్చి వివాహం జరిపిస్తానని మాట ఇచ్చినట్లు శివగామి బాహుబలికి చెబుతుంది. అయితే తను దేవసేనను కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చినట్లు కట్టప్పతో చెప్తాడు. తనకు రాజ్యం కంటే దేవసేనకు ఇచ్చిన మాటే ముఖ్యమని బాహుబలి చెప్పడంతో కథలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది.
ఆగ్రహానికి గురైన రాజమాత భళ్లాలదేవుడిని సేనాధిపతిగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత తండ్రి బిజ్జలదేవ(నాజర్)తో కలిసి కుట్రలు పన్నుతారు. ప్రజలు బాహుబలి వైపే ఉండటంతో వారినుంచి బాహుబలిని దూరం చేయాలన్న నెపంతో లేనిపోనివన్నీ రాజమాతకు నూరిపోస్తుంటాడు భళ్లాలదేవ. భళ్లాలదేవ మాటలను నమ్మిన శివగామి తీవ్రంగా ఆగ్రహించి రక్తసంబంధం కన్నా రాజ్యమే గొప్పదనీ, బాహుబలిని బంధించి, లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనీ ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు.
అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు.భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలు దేరుతుంది. భల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెపుతుంది. రాజమాత పశ్చాత్తాప పడుతుంది.
ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రీ అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కిందివరకూ వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు. ఇది బాహుబలి-1లో జక్కన్న రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
అతడు దేవసేనను బంధించి, కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండోబాహుబలి సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు.?మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు.? అనేది తెరమీద చూడాల్సిందే.
]]>