రాజమాత తో కట్టప్ప రొమాన్స్‌…వైరల్ వీడియో….

కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు .ఈ విషయం తెలుసుకోవడానికి అందరు తలలు బద్దలు కొట్టుకున్నారు,కొంత మంది ఉద్యోగాలు కూడా మానేసి ఆలోచించడం మొదలు పెట్టారు.ఈ ప్రశ్నకి ఎట్టకేలకు సమాదానం దొరికింది.బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. ఇక రాణికి విశ్వాసపాత్రుడిగా, బానిసగా కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి.అయితే థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది..!

ఇంన్టర్ వెల్ లో శివగామి (రమ్యకృష్ణ) పక్కన కట్టప్ప (సత్యరాజ్) కూర్చుని రొమాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఇదేంటి రాజమాతతో బానిస ఇంత చనువుగా ఉండటం ఏంటి? అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యం గా చూసారు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇవ్వగా ఆమె తీసుకుని మురిసిపోతోంది.ఏం జరుగుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇది పోతిస్‌ యాడ్‌ అంటూ తెరపై కనిపిస్తుంది. ఇది వ్యాపార ప్రకటన అని తెలిశాక ప్రేక్షకులు తేరుకున్నారు.

దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి అన్ని వ్యాపార సస్టలు వారి తెలివి తేటలను ఉపయోగించి క్యాష్ చేసుకుంటున్నాయి.సినిమా రిలీజ్ అయిన తెల్లారే బాహుబలి పోస్టర్స్ తో చీరలు వచ్చాయి.ఇప్పుడు రమ్యకృష్ణ, సత్యరాజ్‌లతో యాడ్‌ రూపొందించారు.అందర్నీ ఒక్కసారిగా  ఆశ్చర్యనికి గురి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

[embed]http://www.youtube.com/watch?v=QBz75NMkVTs[/embed]]]>