"కేసీఆర్ పధకం" తల్లి బిడ్డ కోసం

తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులతో కేసీఆర్ కిట్‌ను అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో 100 శాతం ప్రసవాలు జరిగే విధంగా చూడాలని ఆదేశించారు.

కేసీఆర్ కిట్ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 605 కోట్లు కేటాయించారు. శిశువుకు ఉపయోగపడే 16 వస్తువులతో కిట్‌ అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలు ప్రసవం అనంతరం రూ. 12వేలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. డిశ్చార్జి అయిన వెంటనే గర్భిణీలకు రూ. 4 వేలు ఇవ్వనున్నారు. శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో 4 వేలు,మొత్తంగా మూడు విడతల్లో రూ. 12 వేలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆడ పిల్ల పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. తల్లికి కూడా అవసరమైన కిట్ల ను మూడు నెలలకు సరిపోయేలా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది.
]]>