రైతన్నా నీ వెంట నేనుంటా…అన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు ను ముందుకు నడిపించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.ప్రగతి భవన్లో వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు.నకిలీ, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు పెట్టి ఎవరినైనా జైలుకు పంపుతామన్నారు.ఇందుకోసం అవసరమైన చట్టాన్ని రూపొందించాలని ఆదేశించారు.కల్తీ, నకిలీ నియంత్రణకు త్వరలో ఆర్డినెన్స్ జారీ చేస్తామన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ నాణ్యమైనవే అందాలని సీఎం సూచించారు.
పెట్టుబడి సమకూర్చడం నుంచి పంటను ఆహార పదార్థంగా వినియోగించే వరకు రైతుకు వెన్నుముఖ గా నిలవాలన్నారు సీఎం కేసీఆర్. ఖరీఫ్‌కు సరిపడేలా ఎరువులు అందించాలని,కేంద్రమంత్రి అనంతకుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రకటించారు.ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కూడా ఉక్కుపాదం మోపేలా విధానం రూపొందించాలన్నారు కేసిఆర్.
]]>