అగ్నిప్రమాదానికి గురైన ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పరిశీలించిన కేసిఆర్

ఆంధ్రజ్యోతి దిన పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 29 న ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 2, 3 ఫ్లోర్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఫర్నిచర్ కాలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రధాన కార్యాలయంను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఎండీ రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు.సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.

నిన్న నిజామాబాద్ ఎంపీ కవిత, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి, ఇతర ప్రముఖులు కూడా ఆంధ్రజ్యోతి ఆఫీస్ కు వెళ్లి.. పరిశీలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సందర్శించిన వారిలో ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు రాధాకృష్ణకు ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.

]]>