ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లల్ని చదివిస్తున్నారా ..ఇది మీకే

ఈ ఒక్క నెల ఆగితే మరల స్కూల్స్ స్టార్ట్,కొత్త సంవత్సరం కొత్త తరగతులు వీటి తో పాటు కొత్త ఫీజులు ప్రతి సంవత్సరం పెరుగుతున్న స్కూల్ ఫీజులతో.విద్యార్థుల తల్లిదండ్రుల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.నర్సరీ పిల్లలకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని స్కూల్స్.ఈ ఫీజుల భారం తల్లి తండ్రుల మీద పడుతోంది.అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 4వేల 500 వరకు ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

సగానికి పైగా స్కూళ్ల యాజమాన్యాలు ఏటా ఫీజులు ముందస్తుగానే వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాల్ని స్కూళ్లలోనే అమ్ముతున్నాయి యాజమాన్యాలు. రూల్స్ ప్రకారం.మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే అమ్మాలి.స్కూల్ లో  అమ్మే పుస్తకాలు, డ్రెస్సులు మార్కెట్ లో మరో మూడు చోట్ల కచ్చితంగా దొరకాలి. ఒక్కో విద్యార్థి నుంచి ఏటా అదనంగా రూ.1,000-1,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పుస్తకాల్ని, దుస్తుల్ని పాఠశాలలోనే కొనాలని బలవంత పెడితే.తమకు తెలపాలంటున్నారు హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు. ఫిర్యాదులకు 040-23237350 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. deo_hydbad@yahoo.co.in మెయిల్ చేయొచ్చు.

]]>