ఆ వ్యాఖ్యలు ప్రసారం చేసారని మంగళం టీవీ ఛానల్ సీఈఓ అరెస్ట్ ..

కేరళ రాష్ట్రానికి చెందిన “మంగళం” టెలి విజన్ ఛానల్ సీఈఓ అజిత్ కుమార్ ను పోలీస్ లు అరెస్ట్ చేసారు. ఒక మహిళతో జరిగిన అస్లీల సంభాషణలు ప్రసారం చేసిన కారణాల వల్ల పోలీస్ లకు ఫిర్యాదు అందింది.వివరాల్లోకి వెళితే కేరళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏకే శశిధరన్ రాజీనామా కు కారణం మైన ఓ ఆడియో క్లిప్  ను మంగళం ఛానల్ కు చెందిన కొందరు జర్నలిస్ట్ లు రికార్డు చేసారు ఈ క్లిప్ ను యధాతధం గా ప్రసారం కూడా చేసారు ఐతే ఆ ఆడియో క్లిప్ లో ఉన్న సంభాషణ కారణం గా శశి ధరన్ మంత్రి పదవి కోల్పోయారు, కెరళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ లు కేసు ను ఇన్వెస్టిగేషన్ చేసి ఆడియో క్లిప్ ను సీజ్ చేసారు ,ఐతే ఈ కేసు లో ఇప్పటికే ఛానల్ సీఈఓ  తో పాటు మరో కొందరిని ఇంటరాగేషన్ సుహాసిని పోలీస్ లు వారిపై ఐపీసీ 67ఏ ,120బి  కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.ఇదిలా ఉండగా యాంటిసిపేటరీ బెయిల్ ను కోర్ట్ తిరస్కరించింది , రేపు నిందితులను కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్నారు. మహిళా జర్నలిస్ట్ తో చేసిన స్టింగ్ ఆపరేషన్ అని ఛానల్ సీఈఓ అంటుండడం గమనార్హం

]]>